అసత్య ప్రచారానికి ముగింపు పలుకుదాం!
వే2న్యూస్ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వసనీయత ఆసరాగా కొందరు వే2న్యూస్ యాప్ పేరుతో ఫేక్ ఆర్టికల్ స్క్రీన్ షాట్లు ప్రచారం చేస్తున్న ఘటనలు ఇటీవల పెరిగాయి. ఈ అసత్య ప్రచారానికి ముగింపు పలికేలా దేశంలోనే తొలిసారి ప్రతి ఒక్కరూ Fact Check చేసుకునే ఫీచర్‌ను తీసుకొచ్చాము. వే2న్యూస్ పేరుతో మీకు వచ్చే ఫార్వర్డ్ స్క్రీన్‌షాట్లను ఒక్క క్లిక్‌తోనే.. ఆ ఆర్టికల్ వే2న్యూస్ నుంచి పబ్లిష్ అయిందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. ఇది చాలా సులువు..
వే2న్యూస్‌లో పబ్లిష్ అయిన ప్రతి ఆర్టికల్‌కు ప్రత్యేక ఆల్ఫా న్యూమరిక్ (ఆంగ్ల అక్షరాలు మరియు అంకెలతో కూడిన) కోడ్ ఉంటుంది.
తర్వాత ఉండే ఆల్ఫా న్యూమరిక్ కోడ్‌ను (Ex; Way2.co/kart1rk) మీరు ఇక్కడ సెర్చ్ బార్‌లో ఎంటర్ చేయండి.
కోడ్ ఎంటర్ చేశాక Verifyపై క్లిక్ చేస్తే Fact Check టూల్ పరిశీలిస్తుంది.
మా ద్వారా ఆర్టికల్ పబ్లిష్ చేయబడితే ఆ కోడ్‌తో ఉన్న ఆర్టికల్ మీకు ఇక్కడ కన్పిస్తుంది.
ఒకవేళ ఆర్టికల్ కన్పించకపోయినా, ఆ కోడ్‌తో మీకు వేరే ఆర్టికల్‌ను Fact Check టూల్ చూపిస్తుందంటే.. మీకు ఫార్వర్డ్‌గా వచ్చిన వార్తా కథనాన్ని వే2న్యూస్ పబ్లిష్ చేయలేదని అర్థం. మా సంస్థతో సంబంధం లేని బయటి వ్యక్తులు అసత్య ప్రచారం కోసం ఆ వార్తను సృష్టించారని గమనించాలి.